Hero Sriram: నటుడి జీవితంలో మర్చిపోలేని ఘటన.. ఫైర్ యాక్సిడెంట్ వల్ల కెరీర్‌కు బ్రేక్..

Hero Sriram: నటుడి జీవితంలో మర్చిపోలేని ఘటన.. ఫైర్ యాక్సిడెంట్ వల్ల కెరీర్‌కు బ్రేక్..
Hero Sriram: ఓ డ్యామ్ ఉన్న ప్రాంతంలో 30 అడుగుల ఎత్తులో శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాడట.

Hero Sriram: ఎప్పటికప్పుడు కొత్త హీరోలు వచ్చి.. సీనియర్ హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నారు. అందుకే ఈ పోటీని తట్టుకోలేక కొందరు నటీనటులు ఫేడవుట్ అయిపోతున్నారు. అయినా కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందులో ఒకరే శ్రీరామ్. అప్పుడో ఇప్పుడో ఒక సినిమా చేస్తున్న శ్రీరామ్.. చాలాకాలం తర్వాత 'టెన్త్ క్లాస్ డైరీస్' అనే చిత్రంలో హీరోగా కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో తన జీవితంలోని ఓ మర్చిపోలేని సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నాడు శ్రీరామ్.

సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు శ్రీరామ్. తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే.. కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. దానికి కారణం తనకు జరిగిన ఫైర్ యాక్సిడెంటే అని ఇటీవల బయటపెట్టాడు శ్రీరామ్. ఊటీలో ఓ సాంగ్ షూట్ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగిందంటూ దాని గురించి వివరించాడు.

ఓ డ్యామ్ ఉన్న ప్రాంతంలో 30 అడుగుల ఎత్తులో శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాడట. అదే సమయంలో తన చుట్టూ మంటలు ఉంటాయి. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పొరపాటున ఎక్కువ రబ్బరు వేసేసరికి మంటలు ఎక్కువగా వచ్చాయట. అంతే కాకుండా గాలి కూడా ఎక్కువగా వీచేసరికి అక్కడ ఉన్నవారికి మంటలు ఆర్పడం కష్టమయిపోయిందని శ్రీరామ్ అన్నాడు.

మంటలు తన చుట్టూ వ్యాపించడంతో డ్యామ్‌లోకి దూకేద్దామనుకున్నాడట శ్రీరామ్. కానీ అది చాలా లోతుగా ఉండడంతో ఆగిపోయాడట. చివరిగా ఎవరో నిచ్చెన వేసేసరికి ఆ మంటల నుండి బయటపడ్డాడట. కానీ అప్పటికే పెదవులు, చెవులు, జుట్టు బాగా కాలిపోయాయని తెలిపాడు శ్రీరామ్. అయితే తాను అప్పుడు బతుకుతానని నమ్మకం లేదని, తన తల్లిదండ్రులు గురించి తలుచుకుని భయపడ్డాడని శ్రీరామ్ తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story