K. Vishwanath: కళాతపస్వికి 'అశ్రునివాళి"

తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని సుస్థిర స్థానం సంపాదించుకున్న కళాతపశ్వి కె.విశ్వానాథ్ మృతి పట్ల యావత్ తెలుగు ప్రజానీకం అశ్రునివాలి ప్రకటిస్తోంది. అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆయనకు సంఘీభావం తెలియజేశారు. తెలగు సంస్కృతి సంప్రదయాలకు, భారత కళలకు ఆయనే ఒక ప్రతిబింబం అంటూ ట్వీట్ చేశారు. విశ్వనాథ్ కృషి వల్లే తెలుగు పరిశ్రమకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని ట్వీట్ ద్వారా తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సైతం విశ్వనాథ్ గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్.. కె విశ్వనాథ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రపంచంలో కోట్లాది మంది మహానుభావులు ఉంటారు, ఆ మహానుభావులకే మహానుభావుడు మనకు దూరమై, ఆకాశంలో తారగా నిలిచారని ఆయన వ్యాఖ్యానించారు. శంకరాభరణం, సాగరసంగమం వంటి సినిమాలు సినీ చరిత్రలో కళాఖండాలుగా నిలిచిపోతాయని టీజీ వెంకటేష్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com