Prabhas Spirit: ప్రభాస్ 'స్పిరిట్' కోసం రంగంలోకి బాలీవుడ్ భామ..

Prabhas Spirit: ప్రభాస్ స్పిరిట్ కోసం రంగంలోకి బాలీవుడ్ భామ..
Prabhas Spirit: ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోవడంతో తన 25వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Prabhas Spirit: ప్రభాస్ 'స్పిరిట్' కోసం రంగంలోకి బాలీవుడ్ భామ..పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్.. ఒక సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వకముందే రెండు, మూడు సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. అలా ఇప్పటికీ ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ హీరో.. ప్రస్తుతం సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో తన అప్‌కమింగ్ మూవీ స్పిరిట్‌పై ఓ క్రేజీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. తన కెరీర్‌లో ఇది మొదటి చిత్రమే అయినా.. దీంతోనే స్టార్ హీరోల చూపు సైతం తనవైపుకు తిప్పుకున్నాడు. దీని తర్వాత టాలీవుడ్‌లో సందీప్ కెరీర్ దూసుకుపోతుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఇప్పటికీ సందీప్ దగ్గర నుండి మరో తెలుగు సినిమా రాలేదు. ఇక రెండో సినిమానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో చేసే లక్కీ ఛాన్స్‌ను కొట్టేశాడు సందీప్ రెడ్డి వంగా.


ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోవడంతో తన కెరీర్‌లో ల్యాండ్ మార్క్ అయిన 25వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను సెలక్ట్ చేసుకున్నాడు ప్రభాస్.

ఇప్పటికే ఈ మూవీకి స్పిరిట్ అని టైటిల్‌ను అనౌన్స్ చేయగా.. ఇందులో హీరోయిన్‌గా కరీనా కపూర్‌ను అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే స్పిరిట్ కథను కరీనాకు వినిపించాడట సందీప్. కానీ కరీనా ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదట. ఒకవేళ తను ఈ మూవీకి ఓకే చెప్తే.. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కు వస్తున్న హీరోయిన్స్ లిస్ట్‌లో కరీనా పేరు కూడా యాడ్ కానుంది.



Tags

Next Story