టాలీవుడ్

Kiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..

Kiara Advani: కియారా అద్వానీ.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. బాలీవుడ్‌లో.. టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది

Kiara Advani: ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. స్పందించిన కియారా అద్వానీ..
X

Kiara Advani: పాన్ ఇండియా స్టార్ అని పేరు సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అది కూడా ఒకటితో ఒకటి సంబంధం లేని కథలే ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక అలాంటి ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమా ల్యాండ్ మార్క్ చిత్రంగా ఉండిపోతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ల్యాండ్ మార్క్ సినిమాలో కియారా హీరోయిన్‌గా ఖరారు అయ్యిందంటూ వస్తు్న్న రూమర్స్‌పై ఓ క్లారిటీ వచ్చింది.

కియారా అద్వానీ.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. చాలాకాలం గ్యాప్ తర్వాత శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంతో కియారా మరోసారి తెలుగులో మెరవనుంది. ఇదిలా ఉండగా కియారా.. ప్రభాస్ 25వ చిత్రం 'స్పిరిట్'లో కూడా హీరోయిన్‌గా ఎంపికయినట్టు టాక్ వినిపిస్తోంది.

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' చిత్రాన్ని ప్రారంభించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభాస్, సందీప్.. ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. అయినా అప్పుడే ఈ సినిమా గురించి రూమర్స్ వైరల్ అయిపోతున్నాయి. అందులో భాగంగానే కియారా ఇందులో హీరోయిన్‌గా చేస్తుంది అన్న రూమర్స్‌కు చెక్ పెట్టాడు ఆ హీరోయిన్ తరఫు అధికార ప్రతినిధి. స్పిరిట్ కోసం కియారాను ఇంకా ఎవరూ కలవలేదని స్పష్టం చేశాడు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES