లక్ష్మీనరసింహ Vs వర్షం ఈ సినిమాలలో ఏది బిగ్ హిట్ ?

లక్ష్మీనరసింహ Vs వర్షం ఈ సినిమాలలో ఏది బిగ్ హిట్ ?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా జయంత్ సి. పరాంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహ.. ఆసిన్ హీరోయిన్ గా నటించింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా జయంత్ సి. పరాంజి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహ.. ఆసిన్ హీరోయిన్ గా నటించింది. తమిళ్ లో విక్రమ్ హీరోగా వచ్చిన సామి సినిమాకి ఇది రీమేక్.. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అదే రోజున యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం చిత్రం కూడా రిలీజైంది.

ఇందులో ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో అభిమానులు భారీగా హడావిడి చేశారు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. అయితే సంక్రాంతికి బాలయ్యకు పేరు వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం వర్షం మూవీ ప్రభాస్ కి మంచి పేరును తెచ్చిపెట్టింది. 450 సెంటర్స్ లో భారీ అంచనాలతో రిలీజైన లక్ష్మీ నరసింహ 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది.. ఇక ఇదేరోజు వచ్చిన వర్షం సినిమా 200సెంటర్స్ లో రిలీజై, 165సెంటర్స్ లో 50రోజులు, 68సెంటర్స్ లో100 రోజులు ప్రదర్శింపబడింది.

షేర్ విషయంలో రెండు సినిమాలకి పెద్దగా తేడా లేకున్నా లాంగ్ రన్ లో మాత్రం వర్షం కన్నా లక్ష్మీ నరసింహ సినిమా కాస్త వెనుకబడింది. ఇక 2004లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో వర్షం మూడో స్థానంలో నిలిచింది. ఈ సినిమాలు రిలీజైన మరుసటి రోజున వచ్చిన చిరంజీవి అంజి చిత్రం ఘోర పరవభావాన్ని చవిచూసింది.

Tags

Read MoreRead Less
Next Story