‘గుంటూరు కారం‘ మూవీ..రోజుకో వైరల్ న్యూస్

‘గుంటూరు కారం‘ మూవీ..రోజుకో వైరల్ న్యూస్
‘ఖిలాడి‘ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం‘. ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘గుంటూరు కారం‘ మూవీ గురించి రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీలో ‘ఖిలాడి‘ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు లేటెస్ట్ గా ‘గుంటూరు కారం‘ మూవీ న్యూ షెడ్యూల్ మొదలైంది.

మహేశ్ బాబు-త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసినా చేయకపోయినా వీరి కలయికలో వచ్చిన ‘అతడు, ఖలేజా‘ చిత్రాలైతే క్లాసిక్స్ గానే పిలవబడతాయి. ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ పై ‘అతడు‘ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే మహేశ్-త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్న ‘గుంటూరు కారం‘ సినిమాపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది టీమ్.

ఇక ఇప్పటివరకూ షూటింగ్ విషయంలో నత్తనడకన సాగిన ‘గుంటూరు కారం‘ నుంచి కొంతమంది టెక్నీషియన్స్, యాక్టర్స్ తప్పుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల ఈ మూవీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ తప్పుకుంటున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి తమనే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రొడక్షన్ హౌస్ కన్ఫమ్ చేయడంతో దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుంటుందనే న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతోంది.

‘గుంటూరు కారం‘ సినిమాలో మహేశ్ కి జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల ఎంపికయ్యారు. అయితే సినిమా లేటవుతుండడంతో ఈ మూవీ నుంచి పూజా హెగ్డే తప్పుకుంటుందనీ ఆమె పాత్రను శ్రీలీల పోషించబోతుందనే ప్రచారం జోరందుకుంది. ఇక శ్రీలీల చేయాల్సిన రోల్ కోసం ‘ఖిలాడి‘ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసుకున్నారనేది మరో న్యూస్. ‘ఖిలాడి, హిట్ 2‘ చిత్రాలలో రొమాంటిక్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరికి మంచి పేరొచ్చింది. అలాగే ఇదే రోల్ కోసం మీనాక్షితో పాటు ‘జాతిరత్నాలు‘ భామ ఫరియా అబ్దుల్లాని కూడా పరిశీలిస్తున్నారట. మొత్తంమీద తమన్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టే ఇప్పుడు పూజా హెగ్డే, మీనాక్షి చౌదరి విషయాలపైనా చిత్రబృందం ఏదైనా అధికారిక ప్రకటన చేస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story