Ms. Shetty Mr.Polisetty: ఆగస్ట్ 4న గ్రాండ్ రిలీజ్
కొన్ని కాంబినేషన్స్ ఇచ్చే ఎంటర్ టైన్మెంట్ వైవిధ్యం గా ఉంటుంది. అరుంధతి , భాగ్ మతి, దేవసేన వంటి పాత్ర లతో హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న అనుష్క జాతి రత్నాలుతో యూత్ లో ప్రత్యేక మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టి వీరి కాంబినేషన్ అనగానే కలిగిన ఆసక్తి నీ మరింత పెంచేందుకు సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అయ్యేందుకు సిద్దం అయ్యింది. తెలుగు తో పాటు, కన్నడ, తమిళ్, మలయాళం లో శెట్టి పోలిశెట్టి సందడి చేయ బోతున్నారు.
యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగినట్లు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటికి ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఓ పాటను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాడటం విశేషం. ఈ క్రమంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి పాత్రలు మనసులను హత్తుకునేలా రూపొందించారు. టీజర్ చూడగానే ఆ విషయం క్లియర్‌గా తెలిసిపోతుంది. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను గమనిస్తే.. అందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్టర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మెప్పంచటానికి ఆగస్ట్ 4న మన ముందుకు వచ్చేస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com