Samantha Preetham Jukalker : 'చైసామ్' విడిపోవడానికి అతడే కారణం : దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!

Samantha Preetham Jukalker : చైసామ్ విడిపోవడానికి అతడే కారణం : దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!
Samantha Preetham Jukalker : అక్కినేని నాగచైతన్య, సమంత తమ మూడేళ్ళ వివాహబంధానికి వీడ్కోలు పలికారు. ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Preetham Jukalker : అక్కినేని నాగచైతన్య, సమంత తమ మూడేళ్ళ వివాహబంధానికి వీడ్కోలు పలికారు. ఇద్దరం విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ఎందుకు విడిపోతున్నాం అన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే వీరు విడిపోవడానికి గల కారణాల గురించి పలువురు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సమంత ఫ్యామిలీ మేన్ 2 వెబ్‌‌సిరీస్‌‌ లో బోల్డ్‌‌గా నటించడమే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సమంత గతంలో తన పర్సనల్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా అతడి పైన కాళ్లు పెట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో అభిమానులు ఆమెను వీపరితంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు నాగచైతన్య, సమంత విడిపోవడానికి అతడే కారణం అంటూ నెటిజన్లు అతన్ని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

దీనికి తోడు విడాకుల గురించి ప్రకటన రాగానే ప్రీతమ్‌ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. 'నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్‌ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది' అంటూ పోస్ట్‌ చేసిన జుకల్కర్‌.. కొన్ని నిమిషాల్లోనే దానిని డిలీట్‌ చేసేశాడు.

ఈ నేపధ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అతని పైన ట్రోలింగ్‌ చేస్తున్నారు. కొందరికి ప్రీతమ్‌ ఘాటుగానే జవాబు ఇచ్చిన.. ట్రోలింగ్‌ మాత్రం ఎక్కడ కూడా ఆగడం లేదు. ఈ క్రమంలో ప్రీతమ్‌.. తన కామెంట్‌ సెక్షన్‌ని డిసేబుల్‌ చేసేశాడు.Also Read :

Tags

Read MoreRead Less
Next Story