Noel Sean: బిగ్ బాస్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం..

Noel Sean: అసలు ర్యాప్ సాంగ్స్ అనేవి తెలుగులో ప్రాముఖ్యత సాధించక ముందే తెలుగు ర్యాపర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు నోయెల్ సీన్. టాలీవుడ్‌లో ర్యాప్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఆ ఫేమ్‌తోనే బిగ్ బాస్ వరకు వెళ్లిపోయాడు. తాజాగా ఈ సింగర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి సామ్యుయెల్ శనివారం రాత్రి కన్నుమూశారు.
సినీ పరిశ్రమలో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చినా కూడా పలు చిత్రాల్లో నటుడిగా కూడా మెప్పించాడు నోయెల్. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినా పలు ఆరోగ్య సమస్యల వల్ల మధ్యలోనే గేమ్ నుండి తప్పుకున్నాడు. తాజాగా తండ్రి మరణంతో నోయెల్ మరింత కృంగిపోయాడట. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నోయెల్ తండ్రి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
ఇకపోతే నోయెల్.. ఇటీవల సత్యదేవ్ హీరోగా విడుదలయిన 'గాడ్సే' చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు. అంతే కాకుండా తను ప్రధాన పాత్ర పోషించిన 'పంచతంత్ర కథలు' నేరుగా ఓటీటీలో విడుదలయ్యి పాజిటివ్ రెస్పా్న్స్‌ను అందుకుంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com