Pawan Kalyan : రాపిడ్ స్పీడ్ లో - ఓజీ

రాజకీయాల్లో ప్రతిరోజు పవన్ కళ్యాణ్ మాటలు మంటలు రేపుతున్నాయి. ఒకపక్క రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరో పక్క కమిట్ అయిన సినిమాలను శర వేగం గా కంప్లీట్ చేస్తున్నాడు.
సుజిత్ దర్శకత్వం లో మొదలైన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సగం పూర్తి అయ్యిందని టీమ్ వెల్లడించింది.
హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో, ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. "యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా... మూడు అద్భుతమైన షెడ్యూల్‌లు పూర్తయ్యాయి, దుమ్ము రేపాయి. ఓజీ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి" అంటూ ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తాజాగా పూర్తయిన షెడ్యూల్ పట్ల చిత్ర బృందమంతా ఎంతో ఆనందంగా ఉంది.
చిత్రీకరణ సమయంలో సుజీత్ అద్భుతమైన ప్రణాళిక మరియు సమన్వయంతో, పాన్-ఇండియన్ తారాగణం నటిస్తున్న సంక్లిష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చిత్రీకరిస్తూ ఉత్తమమైన అవుట్ పుట్ రాబడుతుండటం పట్ల మేకర్స్ సంతోషంగా ఉన్నారు. జూలై, ఆగస్ట్ లో జరగనున్న షెడ్యూల్స్‌తో, మొత్తం షూటింగ్‌ను త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com