Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..

Prabhas: కొన్ని రీల్ లైఫ్ కపుల్స్‌కు రియల్ లైఫ్ కపుల్స్‌కంటే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఆ నటీనటులు ఒకే స్టేజ్‌పై కనిపించినా.. ఒకే సినిమాలో కలిసి నటించినా.. వారి ఫ్యాన్స్ ఆనందంగా హద్దులు ఉండవు. ఇక టాలీవుడ్‌లో అలాంటి కపుల్స్‌లో ఒకరు ప్రభాస్, అనుష్క. అయితే ఈ జంట ఎప్పుడెప్పుడు మళ్లీ కలిసి నటిస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
ప్రభాస్, అనుష్క.. ఈ ఇద్దరు కలిసి చేసింది నాలుగు సినిమాలే. కానీ ప్రభాస్ సరసన బెస్ట్ హీరోయిన్ అంటే అనుష్కనే. బెస్ట్ కెమిస్ట్రీ ఉన్న కపుల్ అంటే ప్రభాస్, అనుష్కనే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే ఒకవైపు ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుండగా.. అనుష్క మాత్రం సినిమాల నుండి బ్రేక్ తీసుకొని చాలాకాలమే అయ్యింది.
ఇక చాలాకాలం తర్వాత నవీన్ పోలిశెట్టితో చేస్తున్న సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనుంది అనుష్క. అయితే ప్రభాస్, మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'రాజా డీలక్స్'లో హీరోయిన్‌గా అనుష్క చేయనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అనుష్క నటిస్తే.. మూవీకి హైప్ క్రియేట్ అవుతుందని దర్శకుడు మారుతీ.. అనుష్కను ఒప్పించినట్టుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమయితే.. ఫ్యాన్స్ మరోసారి ఈ రీల్ కపుల్ కెమిస్ట్రీని తెరపై ఎంజాయ్ చేయొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com