లక్షల మంది అభిమానులు.. కోట్ల విలువ చేసే కార్లు: ప్రభాస్ రేంజే వేరు

లక్షల మంది అభిమానులు.. కోట్ల విలువ చేసే కార్లు: ప్రభాస్ రేంజే వేరు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్, లంబోర్ఘిని స్పోర్ట్స్ కారు కొనాలని కలలు కన్నాడు.

డార్లింగ్ ప్రభాస్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్. తెలుగు సినిమాని విశ్వవ్యాప్తం చేసిన హీరో. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో. సాహో అంటూ జయకేతనం ఎగుర వేసినా ఆదిపురుష్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తన సినిమాల ద్వారా లక్షలాది మంది అభిమానులతో పాటు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌నూ తన అకౌంట్లో వేసుకున్నాడు. అందుకే తన గ్యారేజీలో ఎన్ని కార్లున్నా 6 కోట్ల విలువ చేసే లంబోర్ఘి కారుంటేనే అందమనుకున్నాడు.

ప్రభాస్ గ్యారేజీలో ఇంకే కార్లున్నాయి...

ప్రభాస్ విలాసవంతమైన కార్లను ఇష్టపడతాడు. 2015 లో రూ .8 కోట్ల విలువైన స్వాన్స్ రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను ఇంటికి తీసుకువచ్చాడు. హైదరాబాద్ వీధుల్లో తరచుగా ఈకారు నడుపుతూ కనిపిస్తాడు. దీంతో పాటు రిట్జీ BMW X3, జాగ్వార్ XJR కూడా ఉన్నాయి.

పరిశ్రమలో నటుడి అద్భుతమైన విజయం

బాహుబలి విజయం తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. భారీ ప్రజాదరణతో పాన్-ఇండియన్ సూపర్ స్టార్‌గా మారారు. తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ 15 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి సినిమాల్లో రొమాంటిక్ పాత్రలను పోషించి అమ్మాయిల కలల రాకుమారుడయ్యాడు.

ఇప్పుడు ఆదిపురుష్, సలార్ చిత్రాలతో మరో సంచలనానికి తెర తీయనున్నాడు. అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రభాస్‌తో చేయడానికి దర్శక నిర్మాతలు ఉవ్విళ్లూరుతుంటారు. ప్రభాస్.. పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్.. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్.. ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30, 2021 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story