రేటు పెంచిన ప్రభాస్... ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. !

రేటు పెంచిన ప్రభాస్... ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. !
ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా ప్రభాస్ కెరీర్ సాగిపోతుంది.

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టుగా ప్రభాస్ కెరీర్ సాగిపోతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ పాన్‌ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.. ఇప్పటికే సాహో రిలీజ్ కాగా... ప్రస్తుతం రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇదిలావుండగా... తాజాగా ప్రభాస్.. తన రెమ్యునరేషన్‌ను విపరీతంగా పెంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

చేయబోయే ఒక్కో సినిమాకు దాదాపుగా 100 కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నాడట.. అయితే దీనికి కొందరు దర్శకనిర్మాతలు షాక్ అవ్వగా, మరికొందరు ప్రభాస్‌ కోసం.. కోట్లు గుమ్మరించడానికైనా రెడీయే అంటున్నారట. ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలకు ప్రభాస్ నూరు కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది..

అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ.. ఒకవేళ నిజమే అయితే దక్షిణాదిలో ఇంత రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలిహీరోగా ప్రభాస్ నిలుస్తాడని అభిమానులు అంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న రాధేశ్యామ్‌ జూలై 30న రిలీజవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story