Ravi Teja: రవితేజ మూవీలో ప్రభాస్.. ఆ హిట్ సినిమా సీక్వెల్‌లో..

Ravi Teja: ఎంత అగ్ర హీరోలు అయినా అప్పుడప్పుడు వారు కూడా గెస్ట్ పాత్రలకు ఓకే చెప్తుంటారు. చాలావరకు సినిమాల్లో గెస్ట్ పాత్రలు కీలకంగా నిలుస్తాయి. అలా ఇప్పటికి ఎంతోమంది స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు. మాస్ మహారాజ్ రవితేజ నటించనున్న చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయనున్నాడని ఓ రూమర్ వైరల్ అయ్యింది.
రవితేజ ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాను నటించిన సినిమాలు కొన్ని యావరేజ్ హిట్‌గా నిలిస్తే.. కొన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక రవితేజ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటించనున్నాడు. రవితేజ కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌గా నిలిచిన 'రాజా ది గ్రేట్'కు వీరిద్దరూ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు.
రాజా ది గ్రేట్‌కు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికీ మూవీ టీమ్ ఎప్పుడో స్పష్టం చేసింది. ప్రస్తుతం రవితేజ, అనిల్ రావిపూడి చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ మూవీ పట్టాలెక్కనుంది. అయితే ఇందులో ఓ గెస్ట్ రోల్‌ను రాసుకున్నాడట అనిల్ రావిపూడి. అది ప్రభాస్ చేస్తే బాగుంటుందని తాను అనుకుంటున్నాడట. నిమిషం తీరిక లేకుండా వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ గెస్ట్ రోల్ ఆఫర్‌ను ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com