'డార్లింగ్' బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసిందోచ్..

డార్లింగ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసిందోచ్..

ఆరడుగల అందగాడు.. ఆజాను బాహుడు.. అభిమానులు ముద్దుగా పిలిచుకునే డార్లింగ్ ప్రభాస్.. ఈశ్వరుడుగా ఎంట్రీ ఇచ్చి.. రాఘవేంద్ర మహత్మ్యంతో అభిమానుల వర్షంలో తడిశాడు. కమర్షియల్ సినిమాలకు ఛత్రపతిలా మారిన ఈ డార్లింగ్ వ్యక్తిత్వంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. మిర్చి లాంటి కుర్రాడిలా కనిపించి.. బాహుబలితో భళా అనేలా చేశాడు. ఇండియన్ సినిమా హిస్ట్రరీని మార్చిన బాహుబలిని చేసింది రాజమౌళి ఊహ అయితే.. ఆ ఊహకు ప్రాణం పోసింది ప్రభాస్. రెబల్ స్టార్ గా ఎల్లలు దాటిన ఖ్యాతిని సంపాదించాడు. రాబోయే సినిమాలతో ఇండియాస్ సూపర్ స్టార్ గా అవతరించబోతోన్న ఈ బుజ్జిగాడి బర్త్ డే సందర్భంగా 'రాధేశ్యామ్' మూవీ యూనిట్ స్పెషల్ మోషన్ టీజర్‌ను రిలీజ్ చేసింది.

ఈ మోషన్ టీజర్‌ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది. రాధాకృష్ణ‌ కుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్ ' మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో యూవీ సంస్థ నిర్మిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై ఓ పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో డార్లింగ్‌ ప్ర‌భాస్‌కి జోడిగా పూజాహెగ్డే నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story