Salaar : జూలై 6 న ఇంటర్నెట్ షేక్ చేయబోతున్న ప్రభాస్

Salaar : జూలై 6 న ఇంటర్నెట్ షేక్ చేయబోతున్న ప్రభాస్
సలార్ టీజర్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులు

పాన్ ఇండియా స్టార్స్ అనగానే మొదట గుర్తుకు వచ్చే హీరో ప్రభాస్ . అతని అడుగుల ముద్రలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద తరగని ఇమేజ్ ని సొంతం చేశాయి.బాహుబలి రెండు పార్ట్ లు..సహో.. ఆదిపురుష్ ప్రభాస్ స్టామినాను మరింత పెంచాయి. ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ పై ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసే విద్వంసం జూలై 6 న రుచి చూడ బోతున్నాము. సాయంత్రం 5:12 pm కి ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్ రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ కు ఇప్పటికే అంచనాలు పీక్స్ కి చేరాయి. మోస్ట్ వయలెంట్ మాన్ గా ప్రభాస్ ని చూసేందుకు అభిమానులు తో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కె జి ఎఫ్ తో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన యూనివర్స్ లో ప్రభాస్ చేసే వయలెన్స్ కి టీజర్ కి ఇంటర్నెట్ లో కొత్త రికార్డ్స్ లు సెట్ అవుతాయని అంచనా

Tags

Next Story