Salaar: 'సలార్' మూవీపై క్రేజీ అప్డేట్.. టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..

Salaar: సలార్ మూవీపై క్రేజీ అప్డేట్.. టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..
Salaar: శాండిల్‌వుడ్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రిస్క్ అయినా కూడా ఒకేసారి మూడు సినిమాలను పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్ని షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేస్తున్నాడు. ఇక అన్ని సినిమాలకంటే ముందుగా 'సలార్' ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రభాస్ అభిమానుల సలార్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయినట్టుగా రూమర్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

శాండిల్‌వుడ్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 సినిమా థియేటర్లలో విడుదలయ్యి రికార్డులను బ్రేక్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1 చూసి చాప్టర్ 2పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులను ఏ మాత్రం నిరాశపరచలేదు ప్రశాంత్ నీల్. అందుకే ప్రభాస్ అభిమానులు కూడా సలార్‌ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

సలార్‌లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సలార్ క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే జులై రెండో వారంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇప్పటికే షూటింగ్ కూడా చాలావరకు పూర్తవ్వడంతో ఈ రూమర్ నిజమేనేమో అని అభిమానులు ఆశపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story