Kadali Jaya Sarathi: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు సారథి కన్నుమూత..

Kadali Jaya Sarathi: సారిధి పూర్తి పేరు కడలి విజయ సారథి. 1942 జూన్ 26న పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జన్మించిన జయ సారథి.. 1960లో యన్టీఆర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన 'సీతారామ కళ్యాణం'తో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పరమానందయ్య శిష్యుల కథ, భక్త కన్నప్ప, అమరదీపం, జగన్మోహిని, మన ఊరి పాండవులు, సొమ్మొకడిది సోకొకడిది, కోతల రాయుడు, నాయకుడు – వినాయకుడు వంటి చిత్రాలు సారథికి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి.
తన సినీ ప్రస్థానంలో 372 సినిమాల్లో నటించిన సారథి.. తెలుగు సినీ ఇండస్ట్రీ మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మరోవైపు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడిగా.. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా సేవలు అందించారు. సినీ పరిశ్రమలోనే కాదు, నాటకరంగ అభివృధ్దికి సైతం విశేష సేవలందించారు సారథి. నటుడిగానే కాకుండా.. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు వంటి చిత్రాలను కూడా సారథి నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com