Singeetham Srinivasa Rao: ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం..

Singeetham Srinivasa Rao: ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం..
Singeetham Srinivasa Rao: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం చోటుచేసుకుంది.

Singeetham Srinivasa Rao: ఎన్నో తెలుగు సినిమాలకు దర్శకుడిగా, రచయితగా పనిచేశారు సింగీతం శ్రీనివాసరావు. అంతే కాకుండా అప్పుడప్పుడు నటుడిగా తెరపై కూడా మెరిశారు. అలాంటి లెజెండరీ డైరెక్టర్ సింగీతం ఇంట విషాదం చోటుచేసుకుంది. సింగీతం భార్య లక్ష్మి కళ్యాణి కన్నుమూశారు. ఈ విషయాన్ని సింగీతం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

'నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యం ముగిసింది' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సింగీతం. 1960లో సింగీతం, లక్ష్మీకల్యాణిల పెళ్లి జరిగింది. లక్ష్మి కళ్యాణి.. రైటర్‌గా తన భర్త సింగీతం కథలకు సహకారం అందించేవారు. అంతే కాకుండా భార్య కోసం సింగీతం.. శ్రీకల్యాణీయం అనే పుస్తకాన్ని కూడా రచించారు.



Tags

Read MoreRead Less
Next Story