ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య అలా అనేసరికి... రాత్రంతా ఏడుస్తూనే సునీత..!

ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య అలా అనేసరికి... రాత్రంతా ఏడుస్తూనే సునీత..!
అప్పుడప్పుడు తన జీవితంలో ఎదురైన చేదుజ్ఞాపకాలను, బాధించిన సంఘటనలను పలు ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారమే.

ఉపద్రష్ట సునీత.. సింగర్ సునీతగా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచుతురాలే.. సింగర్‌‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌గా, యాంకర్‌‌గా ప్రేక్షకులను మెప్పించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అప్పుడప్పుడు తన జీవితంలో ఎదురైన చేదుజ్ఞాపకాలను, బాధించిన సంఘటనలను పలు ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారమే. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఓ ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో పాట పాడేందుకు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోని సంఘటన ఎదురైందని, ఆ సంఘటన వలన దానిని తలుచుకుంటూ రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చున్నానని చెప్పుకొచ్చింది.

పాట పాడేందుకు స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ తన చేతిలో ఉన్న మైకును నాకు ఇచ్చారు. దానిని తీసుకొని నేను పాట పాడాను. అనంతరం ఆ మైక్ అక్కడ పెట్టి వెళ్తుండగా సదరు మ్యూజిక్ డైరెక్టర్ భార్య తనని పిలిచి దారుణంగా అవమానించినట్టుగా చెప్పుకొచ్చింది సునీత. "ఏంటీ మైక్‌ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావు.. అసలేమనుకుంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది." ఆమె మాటలు విని నేను ముందుగా షాక్ అయ్యానని సునీత చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత నా స్టయిల్‌లో ఆమెకు గట్టిగా సమాధానం ఇచ్చానని, కానీ అక్కడ ధైర్యంగా మాట్లాడినప్పటికీ ఆమె అలా అనడం చాలా బాధ అనిపించిందని తెలిపింది. దాన్ని తలుచుకుంటూ రాత్రంతా ఏడ్చానని చెప్పుకొచ్చింది. ఇలాంటి సంఘటనలు తన జీవితంలో చాలానే ఉన్నాయని ఆమె వెల్లడించింది. అయితే ఎవరా సంగీత దర్శకుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇదిలావుండగా రామ్‌ వీరపనేనిని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది సునీత.

Tags

Read MoreRead Less
Next Story