‘సత్యభామ‘ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్..

‘సత్యభామ‘ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్..
కాజల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ‘సత్యభామ‘ టైటిల్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే.. అవి తప్పని నిరూపించిన భామల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. పెళ్లి తర్వాత కూడా కథానాయికగా జోరు తగ్గని కాజల్ హీరోయిన్ గా ఓరియెంటెడ్ గా నటిస్తున్న మూవీ ‘సత్యభామ‘. ఇటీవలే కాజల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన ‘సత్యభామ‘ టైటిల్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

టాలీవుడ్ లో ఒకటిన్నర దశాబ్దానికి పైగా కథానాయికలుగా కొనసాగుతోన్న అతికొద్దిమంది భామల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. టాలీవుడ్ లో ఎ టు జెడ్ స్టార్ హీరోస్ ను కవర్ చేసిన కాజల్.. ప్రస్తుతం బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి‘, కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2‘ చేస్తూనే ఉమన్ ఓరియెంటెడ్ గా ‘సత్యభామ‘ సినిమా చేస్తోంది. కాజల్ అగర్వాల్ కెరీర్ లో 60వ సినిమాగా తెరకెక్కుతోన్న ‘సత్యభామ‘ మూవీ నుంచి కాజల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన టైటిల్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది.

తన గత చిత్రాలకు విభిన్నంగా ‘సత్యభామ‘ మూవీలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తోంది కాజల్. ఈ టైటిల్ గ్లింప్స్ లో సత్యభామ గా కాజల్ మేకోవర్ కి.. రఫ్పాడించే బాడీ లాంగ్వేజ్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. లేటెస్ట్ గా ‘సత్యభామ‘ గ్లింప్స్ యూట్యూబ్ లో త్రీ మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి ఈ రేంజులో అప్లాజ్ రావడం గ్రేట్ ఫీట్ అని చెప్పొచ్చు.

ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘సత్యభామ‘ మూవీకి అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నాడు. గూఢచారి, మేజర్ లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్షన్ చేసిన శశికిరణ్ తిక్కా.. ఈ చిత్రానికి స్క్రీన్‍ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా ఉండడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అవురమ్ బ్యానర్‌పై బాబీ తిక్క నిర్మిస్తున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేసిన కాజల్ ‘సత్యభామ‘తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story