Raja Deluxe Movie: మారుతి, ప్రభాస్‌ల 'రాజా డీలక్స్' సినిమా కథ ఇదే..!

Raja Deluxe Movie: మారుతి, ప్రభాస్‌ల రాజా డీలక్స్ సినిమా కథ ఇదే..!
Raja Deluxe Movie: పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు.

Raja Deluxe Movie: పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఈ హీరో నటిస్తున్న అన్ని అప్‌కమింగ్ చిత్రాలతో పోలిస్తే.. మారుతితో చేస్తు్న్న సినిమాకే అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయినా కూడా ప్రభాస్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటికే ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. ఫ్యాన్స్ అంతా తమ హీరో నుండి ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను కోరుకుంటున్నారు. అందుకే వారి ఎదురుచూపు సలార్ కోసమే అన్నట్టుగా ఉంది. అయితే ఇప్పటికే వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతితో చేస్తున్న చిత్రానికి కూడా ముహూర్తం ఖరారు చేశాడు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఖారరయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇది ఒక తాత, మనవడి కథ అని, రాజా డీలక్స్ అంటే తాత స్థాపించిన థియేటర్ పేరు అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ సిటీలో రాజా డీలక్స్ సెట్ రెడీ అయ్యిందట. అంతే కాకుండా ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కొందరు అంటున్నారు. ఇక మారుతి చివరిగా తెరకెక్కించిన 'ప్రతిరోజు పండగే' చిత్రం కూడా తాత, మనవడి కథాంశంతోనే తెరకెక్కింది.

Tags

Read MoreRead Less
Next Story