Tollywood: 'వడక్కుపట్టి రామసామి'

Tollywood: వడక్కుపట్టి రామసామి
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం హీరోగా 'వడక్కుపట్టి రామసామి'

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం హీరోగా 'వడక్కుపట్టి రామసామి' రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఖరారు చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. జాన్ విజయ్, ఎంఎస్ భాస్కర్, రవి మరియ, మారన్, మొట్టా రాజేంద్రన్, నిజల్గల్ రవి, శేషు, ప్రశాంత్, జాక్వెలిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.


సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'విట్ నెస్' చిత్రంతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్ గా శివ నందీశ్వరన్, ఆర్ట్ డైరెక్టర్ గా రాజేష్, కొరియోగ్రాఫర్ గా షరీఫ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన బృందం ఈ సినిమాకు షూటింగ్ జనవరి 24న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ ఎంటర్‌టైన్మెంట్‌ సినిమా వేసవిలో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story