Tollywood: 'బాహుబలి'కి ఒక్క ఎపిసోడ్ సరిపోదంట... అందుకే అలా..

Tollywood: బాహుబలికి ఒక్క ఎపిసోడ్ సరిపోదంట... అందుకే అలా..
న్యూ ఇయర్ స్పెషల్‌ గా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు డబుల్ ధమాకా డార్లింగ్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌ బాహుబలి లెవల్‌ లో ప్రభాస్‌ ఎపిసోడ్స్‌ ఫుల్‌ ఎపిసోడ్స్‌ ను రిలీజ్‌ చేసేలా ఆహా ప్లాన్‌

Tollywood: నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికే' షోకు భీభత్సమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే ఈ షోకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్‌ గా కార్యక్రమంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరవ్వడంతో అన్ స్టాపబుల్ కు ఉన్న ఇమేజ్‌ ఒక్కసారిగా తారా స్థాయికి చేరుకుంది. ఇటీవలే విడుదలైన ప్రోమో షోపై విపరీతమైన హైప్‌ క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్‌ ఎపిసోడ్ ను ఎప్పుడెప్పుడు రిలీజ్‌ చేస్తారా అని తెలుగురాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


దీంతో ఈ ఎపిసోడ్ ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించారు షో నిర్వాహకులు. ఇకపోతే ప్రభాస్‌ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుందంటూ ట్వీట్ చేశారు ఆహా టీం. అంతేకాదు ది బిగినింగ్ ఎపిసోడ్‌ని ఈ నెల 30న, ది కన్‌క్లూజన్ ఎపిసోడ్‌ని జనవరి 6న రిలీజ్ చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఇక ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.


సాధారణంగా ప్రభాస్ ఇంటర్వ్యూలకు దూరం. ఇక టీవీలో కనిపించేందుకు అస్సలు ఇష్టపడడు. అలాంటిది ఫస్ట్‌ టైం డార్లింగ్‌ ఓటిటి ఛానల్ కి వచ్చి మాట్లాడడంతో, ఈ షోపై బీభత్సమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అలాగే ప్రభాస్ జీవితంలో జరిగిన చాలా సంఘటనలను ఈ ఇంటర్వ్యూ లో చర్చించినట్లుగా తెలుస్తోంది. సో షో మొత్తం విత్‌ అవుట్‌ ఎడిటింగ్‌ రెండు భాగాలుగా రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశారు.


అయితే ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు, మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా హాజరయ్యాడు. వీరిద్దరూ చాలా కాలం నుంచి మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక గోపిచంద్‌, ప్రభాస్ సీక్రెట్స్ బయట పెట్టేశాడంటూ టాక్‌ వినిపిస్తోంది. ఇక ప్రోమోలతోనే రికార్డులు సృష్టించిన ఈ ఎపిసోడ్.. రెండు భాగాలుగా వస్తూ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story