5 April 2021 2:30 PM GMT

Home
 / 
సినిమా / టాలీవుడ్ / 57 ఏళ్ళ‌ వ‌య‌సులో...

57 ఏళ్ళ‌ వ‌య‌సులో సిక్స్ ప్యాక్ చేసిన ప్రొడ్యూస‌ర్

లాక్ డౌన్ లో అంద‌రికీ పిట్ నెస్ ని పెంచుకుందామ‌నే ఆలోచ‌నతో జిమ్ లోకి అడుగు పెట్టిన వ‌ర్లు సిక్స్ ప్యాక్ చేసి అంద‌రికీ రోల్ మోడ‌ల్ గా నిలిచారు.

57 ఏళ్ళ‌ వ‌య‌సులో సిక్స్ ప్యాక్  చేసిన ప్రొడ్యూస‌ర్
X

"క్షణ క్షణం" సినిమాతో నిర్మాత‌గా మారిన డా. వ‌ర్లు ప‌ర్సనాల‌టీ డ‌వ‌లెప్ మెంట్ ట్రైన‌ర్ గా సుప్రసిద్దులు. లాక్ డౌన్ లో అంద‌రికీ పిట్ నెస్ ని పెంచుకుందామ‌నే ఆలోచ‌నతో జిమ్ లోకి అడుగు పెట్టిన వ‌ర్లు సిక్స్ ప్యాక్ చేసి అంద‌రికీ రోల్ మోడ‌ల్ గా నిలిచారు. సిక్స్ ప్యాక్ అనేది పిట్ నెస్ సింబ‌ల్ గా చూస్తారు. 57 ఏళ్ళ వ‌య‌స్సులో సిక్స్ ప్యాక్ చేయాలంటే చాలా ధృడ సంక‌ల్పం కావాలి. మోటివేష‌న‌ల్ ట్రైన‌ర్ గా వేల‌మంది జీవితాల‌లో గొప్ప మార్పులు తెచ్చిన డా. వ‌ర్లు కి ఈ సిక్స్ ప్యాక్ అనేది కొత్త ఛాలెంజ్ గా మారింది. క‌ఠోర శ్రమ‌, అంకిత భావంతో ఐదు నెల‌ల‌లో సిక్స్ ప్యాక్ చేసి అందరినీ ఆశ్చర్య ప‌రిచారు. చాలా మందికి రోల్ మెడ‌ల్ గా నిలిచారు.

ఈసంద‌ర్భంగా డా. వ‌ర్లు మాట్లాడుతూ.. "క‌రోనా విజృభిస్తున్న టైంలో అంద‌రికీ ఆరోగ్యంగా ఉండ‌టం, ఫిట్ గా ఉండ‌టం ఎంత అవ‌స‌ర‌మో తెలిసింది. నేను కూడా ఫిట్ నెస్ కోస‌మే జిమ్ లోకి అడ‌గు పెట్టాను. త‌ర్వాత సిక్స్ ప్యాక్ చేయాల‌ని అనిపించింది. మా ట్రైన‌ర్ వెంక‌ట్ కూడా నా ఆలోచ‌న‌ల‌ను ప్రోత్సహించారు. అప్పటి నుండి నా డైట్ ని ఆయ‌న సూచించిన విధంగా మార్చుకున్నాను. ఎంత ప‌నుల‌లో ఉన్నా కూడా వ‌ర్క్ అవుట్స్ మానే వాడిని కాను. ఆరోజు చేయ‌వ‌ల‌సిన‌వి చేసే నిద్ర పోయే వాడిని. మాట్రైన‌ర్ కి కూడా నేను ఎంత సీరియ‌స్ గా ఉన్నానో అర్ధం అయ్యాక నా పై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. త‌ర్వాత మా రిలేష‌న్ చాలా ఫ్రెండ్లీగా మారిపోయింది. నేను సిక్స్ ప్యాక్ చేసిన వీడియో చూసిన త‌ర్వాత చాలా మంది ఇది గ్రాఫిక్సా అని కూడా అడిగారు.

నా దృష్టిలో సిక్స్ ప్యాక్ అనేది ఎవ‌ర‌యినా చేయోచ్చు.. దానికి కావ‌ల్సింది డైట్ ని ఫాలో అవ‌డం. క్రమం త‌ప్పకుండా వ‌ర్క్ అవుట్స్ చేయ‌డం , స‌రైన ట్రైన‌ర్ కూడా చాలా అవ‌స‌రం ఒక్కోసారి మొద‌లు పెట్టిన ప్రయాణం మ‌ద్యలో అల‌స‌ట‌గా అవుతుంది. తిరిగి వెన‌క్కు వెళ‌దామా అనిపిస్తుంది అటువంటి సంద‌ర్భాల్లో మ‌న‌ల్ని ఉత్సాహప‌ర‌చి ముందుకు న‌డిపించే ట్రైన‌ర్ చాలా అవ‌స‌రం అవుతాడు. నాకు అటువంటి ట్రైన‌ర్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సిక్స్ ప్యాక్ చేసిన త‌ర్వాత చాలా మంది నా ఫ్రెండ్స్ కి ఫిట్ నెస్ పై ఆస‌క్తి క‌లిగిందన్నారు.

ట్రైన‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ..."చిన్నప్పటి నుండి నాకు స్పోర్ట్స్ అంటే ప్రాణం ఆ ఇంట్రెస్ట్ తోనే ఫిట్ నెస్ పై నాకు ప్యాష‌న్ క‌లిగింది. నేను చాలా మంది కి సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ ఇచ్చాను. ఫిల్మ్ ప‌ర్సనాల‌టీస్ కి కూడా ప‌ర్సన‌ల్ ట్రైన‌ర్ గా ఉన్నాను. కానీ డా. వ‌ర్లు నాకు ప్రత్యేక మైన స్టూడెంట్ గా ఫీల్ అవుతాను. 57 ఏళ్ళ వ‌య‌స్సులో ఫిట్ నెస్ అంటేనే చాలా మందికి అపోహ‌లుంటాయి. వాళ్ళు వాకింగ్ లాంటివి ఇష్టప‌డ‌తారు. త‌మ‌కు ఈ వ‌య‌స్సులో చేయ‌లేం అని ముందుగానే ఫిక్స్ అవుతారు. కానీ వ‌ర్లు అలాకాదు.

ఆయ‌న ట్రైన‌ర్ ని పూర్తిగా న‌మ్మారు,అలాగే నేను ఈ సిక్స్ ప్యాక్ చేయ‌గ‌ల‌ను అని ఫిక్స్ అయ్యారు. చెప్పిన వ‌ర్క్ అవుట్స్ ని చాలా నిబ‌ద్దత‌‌తో కంప్లీట్ చేసే వారు ఇచ్చిన డైట్ ని ఫాలో అయ్యేవారు. దీంతో నాకు చాలా ఇంట్రెస్ట్ క‌లిగింది. ఐదు నెల‌ల‌లో సిక్స్ ప్యాక్ చేయ‌గ‌లిగారు అంటే అది కేవ‌లం ఆయ‌న దృధ సంక‌ల్పంతో నే సాధ్యం అయ్యింది. మా జిమ్ లో మోటివేష‌న్ కోసం ఆయ‌న సిక్స్ ప్యాక్ చేసిన వీడియో పెడుతున్నాం అంత‌గా ఆయ‌న మా అంద‌రినీ ఇన్స్ ఫైర్ చేసారన్నారు.

Next Story