యజ్ఞం సినిమాని మిస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

దర్శకుడు టి.కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు హీరో గోపీచంద్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తోలివలుపు చిత్రం గోపీచంద్‌కి మొదటి సినిమా.. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. హీరోగా బ్రేక్ రాకపోవడంతో జయం సినిమాలో వచ్చిన విలన్ రోల్‌లో నటించి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు గోపీచంద్.. ఆ తర్వాత నిజం, వర్షం సినిమాలలో కూడా విలన్‌గా నటించాడు. అయితే ఈ సినిమాల తర్వాత గోపీచంద్‌ని హీరోని చేస్తానాని తేజ మాటవ్వడంతో మళ్ళీ హీరోగా రెడీ అవుతున్నాడు గోపీచంద్.
మరోపక్కా పోకూరి బాబురావు నిర్మాతగా, ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకుడిగా యజ్ఞం సినిమా కథ సిద్దమవుతుంది. ఈ సినిమాని ప్రభాస్‌తో అనుకున్నారు పోకూరి బాబురావు. ఇదే కథని వెళ్లి ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజుకి వెళ్లి చెప్పగా, ఆయన కూడా ఒకే చెప్పారు.. కానీ దర్శకుడిగా బి గోపాల్‌తో ఈ కథని చేద్దాం అనుకున్నారు. కానీ కథపై, దర్శకుడు రవికుమార్ చౌదరి పైన ఉన్న నమ్మకం ఉండడంతో ఎవరో ఎందుకు గోపీచంద్‌నే హీరోగా పెట్టి సినిమా తీయాలని పోకూరి బాబురావు అనుకున్నారు.
అలా గోపీచంద్ హీరోగా, ఈతరం ఫిలింస్ బ్యానరుపై యజ్ఞం సినిమా మొదలైంది. బాక్స్‌ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆంధ్రుడు, రణం చిత్రాలతో హ్యట్రిక్ అందుకున్నాడు గోపీచంద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com