యాంకర్ శ్యామల భర్త అరెస్ట్..! ‌

యాంకర్ శ్యామల భర్త అరెస్ట్..! ‌
ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చీటింగ్ కేసులో భాగంగా ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చీటింగ్ కేసులో భాగంగా ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తీరా డబ్బుల విషయం అడిగితే తనపై బెదిరింపులకు దిగుతున్నారని, అంతేకాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయంలో ఓ మధ్యవర్తి మహిళ ద్వారా నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సింహారెడ్డితో పాటు మధ్యవర్తి అయిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story