చిరంజీవి కీరవాణి కాంబోలో రాబోతున్న సినిమా..

చిరంజీవి కీరవాణి కాంబోలో రాబోతున్న సినిమా..
మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి-కీరవాణి కాంబోలో రాబోతున్న సినిమా

ప్రెజెంట్ ‘భోళా శంకర్‘తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. సైలెంట్ గా తన అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన పనుల్లో స్పీడ్ పెంచాడు. ‘బింబిసార‘ డైరెక్టర్ వశిష్టతో చేయబోయే సోషియో ఫాంటసీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేశాడట. ఆస్కార్ విజేత కీరవాణి చిరంజీవి-వశిష్ట మూవీకి సంగీతాన్ని సమకూర్చనున్నాడట. మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి-కీరవాణి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే కాబోతుంది.

మరకతమణి కీరవాణికి మెగా హీరోలతో అరుదైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు కీరవాణి పనిచేసిన తొలి చిత్రంతోనే సూపర్ హిట్స్ ఇచ్చాడు. ఈకోవలోనే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనూ ‘హరిహర వీరమల్లు‘కి పనిచేస్తున్నాడు కీరవాణి. అంతేకాకుండా లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో మరోసారి పనిచేసే అవకాశం కీరవాణికి లభించిందట.

చిరంజీవితో కీరవాణి తొలి చిత్రం ఘరానామొగుడు'. 1992లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి, కీరవాణి కాంబోలో ‘ఆపద్భాంధవుడు‘, ‘ఎస్.పి.పరశురాం‘ వంటి సినిమాలొచ్చాయి. ఇక మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందట. ప్రస్తుతం ‘భోళా శంకర్‘తో బిజీగా చిరంజీవి ఆ తర్వాత ‘బింబిసార‘ ఫేమ్ వశిష్టతో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నాడట.

చిరంజీవి-వశిష్ట మూవీపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే.. సైలెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం పూర్తవుతున్నాయట. ఈ సినిమాని చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ తరహాలో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నాడట వశిష్ట. ఈమూవీకి ‘ముల్లోక వీరుడు‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే.. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా ఎనిమిది మంది కథానాయికలు నటించబోతున్నారట. మొత్తంమీద.. భారీ గ్యాప్ తర్వాత కలిసి పనిచేయబోతున్న చిరంజీవి-కీరవాణి సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story