Sujeeth: 'సాహో' డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన మెగా హీరో..

Sujeeth: హిట్ అందుకున్న దర్శకులకే ప్రస్తుతం హీరోల డేట్లు దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే యంగ్ హీరోలు మాత్రమే కాదు.. సీనియర్ హీరోలు కూడా దాదాపు రెండు లేదా మూడు సినిమాలను ఒకేసారి ఖరారు చేసి పెట్టుకున్నారు. దీంతో ఇతర దర్శకులకు కాల్ షీట్స్ దొరకడం కష్టంగా మారింది. అలాంటి భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న ఓ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు ఈ మెగా హీరో.
'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. దీంతో ఆ సినిమా తర్వాత తన నుండి వచ్చే చిత్రాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే బాహుబలి తర్వాత వెంటనే విడుదలయిన 'సాహో' ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఆ మూవీని డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ సుజీత్‌పై నెగిటివిటీ ఎక్కువయిపోయింది. అందుకే ఇంతకాలం సుజీత్ మరో సినిమాను తెరకెక్కించలేదు.
సాహో తర్వాత ఇంతకాలం ఖాళీగా ఉన్న సుజీత్‌కు ఓ మెగా హీరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఎఫ్ 3' చిత్రంతో కామెడీ హిట్‌ను అందుకున్న వరుణ్ తేజ్.. త్వరలోనే సుజీత్‌తో ఓ సినిమా చేయనున్నట్టు రూమర్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ మూవీ తర్వాత వరుణ్, సుజీత్ మూవీ పట్టాలెక్కబోతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com