Mohan Babu : కేసీఆర్‌ను సన్మానించామా.. జగన్‌ను ఆహ్వానించామా : మోహన్ బాబు

Manchu Mohan Babu : మోహన్ బాబు ప్రత్యర్థులపై ఒక్కో బాణాన్ని వదులుతున్నారు. టాలీవుడ్ ను ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. వేదిక దొరికిందని ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రుల సహకారం లేకపోతే ఎంత పని చేసినా వృథా అని తేల్చేశారు. దీంతో ఈ పాయింట్స్ పాలిటిక్స్ కు దగ్గరగా ఉన్నాయనుకుంటోంది టాలీవుడ్.
నటీనటులకు సాయం చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులను కోరాలన్నారు మోహన్ బాబు. కేసీఆర్ ను నటీనటులు ఎప్పుడైనా సన్మానించారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఎన్నికల ప్రచారం సమయంలో మంచు విష్ణు కామెంట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు మంచు వారి అభిమానులు. ఎందుకంటే.. తాను ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎంలను కూడా కలుస్తానని ఆయన చెప్పారు.
జగన్ ను ఎప్పుడైనా, ఏ వేడుకకైనా ఆహ్వానించారా అని టాలీవుడ్ ను క్వశ్చన్ చేశారు మోహన్ బాబు. నిజానికి ఇప్పుడు ఏపీలో థియేటర్ల టిక్కెట్ల విషయంలో వివాదం నడుస్తోంది. ఇలాంటి సమయంలో మోహన్ బాబు ఈరకమైన వ్యాఖ్యలు చేయడంతో అవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో కూడా ఇవి హాట్ పాయింట్స్ గా మారాయి.
దాసరి లేని లోటును భర్తీ చేయలేమని.. ఇండస్ట్రీ పెద్ద అనే హోదా తనకు వద్దని చెప్పారు. దీంతో మోహన్ బాబు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందా అన్న ఆసక్తి పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com