Salaar: సలార్‌తో రాకీ భాయ్.. స్క్రీన్ షేర్ చేసుకోనున్న ప్రభాస్, యశ్..

Salaar: 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు 'సలార్'తో తన మ్యాజిక్ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. కానీ ఈ మూవీ గురించి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రానివ్వలేదు మూవీ టీమ్. హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఫైనల్ చేశారనే తప్ప ఇంకా ఏ క్యాస్టింగ్ వివరాలు బయటికి రానివ్వలేదు. తాజాగా సలార్‌పై ఓ క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది.
కేజీఎఫ్ చిత్రంతో దర్శకుడిగా ప్రశాంత్ నీల్‌కు ఎంత పేరొచ్చిందో.. హీరోగా యశ్‌కు కూడా అంతే పేరు దక్కింది. అయితే కేజీఎఫ్ రెండు చాప్టర్లు పూర్తయినా కూడా మూడో చాప్టర్ కూడా ఉండబోతుందని ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పాడు ప్రశాంత్ నీల్. కానీ దానికి ఇంకా సమయం పడుతుంది. అంతలోపే మరోసారి యశ్‌ను డైరెక్ట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్.
సలార్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు యశ్ కూడా ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ చేయనున్నట్టు ప్రచారం మొదలయ్యింది. సలార్ మూవీ ఓపెనింగ్‌కు యశ్ వచ్చినప్పుడు ప్రభాస్, యశ్ కలిసి ఓ సినిమా తీస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఆశపడ్డారు. ఇప్పుడు ఆ మాటే నిజం చేస్తూ వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించనున్నాడు ప్రశాంత్ నీల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com