Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 .. అతనికే భారీ రెమ్యునరేషన్.. !

బిగ్‌బాస్.. నార్త్‌లో మొదలైన ఈ షో మెల్లిమెల్లిగా సౌత్‌లోకి పాకి తెలుగులో కూడా మాంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ రియాలిటీ షో. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్స్‌ని సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదో సీజన్‌కి రెడీ అయిపోతుంది. ఇప్పటికే స్టార్‌మా అధికారికంగా ప్రకటిస్తూ బిగ్‌బాస్-5 లోగోని కూడా విడుదల చేసింది. దీనితో ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్‌ల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇందులో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, సురేఖ వాణి, నవ్యస్వామి, షణ్ముఖ్ జశ్వంత్, ఈషా చావ్లా, జబర్దస్త్ ప్రియాంక, ఆనీ మాస్టర్, ఉమా దేవి, సన్నీ, మోడల్ జస్వంత్, పూనం భాజ్వా, యాంకర్ శివ, లోబో, యాంకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం యూట్యూబ్ స్టార్ షణ్ముక్ పేరు మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
సీజన్-5లో మరే కంటెస్టెంట్‌కి లేని విధంగా షణ్ముఖ్‌కి కోటి వరకు పారితోషికాన్ని ఇచ్చేందుకు షో నిర్వాహకులు రెడీ అయిపోయారని తెలుస్తోంది. . ఇప్పటివరకు ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి మాత్రమే ఉన్నారు. కాగా 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్' వెబ్‌సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ తాజాగా సూర్య వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకున్నాడు.
ఇక సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ ఐదో సీజన్ మొదలుపెట్టాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com