December 21 : 16 గంటలు.. నేడే సుదీర్ఘ రాత్రి..

December 21 : 16 గంటలు.. నేడే సుదీర్ఘ రాత్రి..
X

డిసెంబర్ 21.. ఖగోళ శాస్త్ర ప్రకారం ఇది ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శీతాకాలపు అయనాతం ఏర్పడుతుంది. ఈ రోజున పగటి పూట సమయం తక్కువగా.. రాత్రిపూట సమయం ఎక్కువగా ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే డిసెంబర్ 21వ తేదీన పగటి సమయం 8 గంటలు మాత్రమే ఉండనుంది. మిగిలిన 16 గంటలూ రాత్రి సమయమే. ఇందుక్కారణం ఈ రోజు భూమి ఉత్తర దృవం సూర్యునికి అతి దూరంగా ఉంటుంది. సూర్యుడు దక్షిణార్ధ గోళంలోని కర్కాటక రేఖ ప్రదేశంలో మధ్యాహ్నం పూటకు సరిగ్గా 90డిగ్రీలలో నిగా ఉంటాడు. దీంతో ఉత్తరార్ధ గోళంలోని ప్రదేశాల్లో అతితక్కువ పగటి సమయం నమోదవు తుంది. అదే సమయంలో దక్షిణార్ధ గోళం వారికి వేసి అయనాతం ప్రారంభమవుతుంది. ఈ రోజు సూర్యుడి నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ప్రసరిస్తుంది.

Tags

Next Story