Kumbh Mela Traffic : కుంభమేళా దారిలో 300 కి.మీ ట్రాఫిక్ జామ్

Kumbh Mela Traffic : కుంభమేళా దారిలో 300 కి.మీ ట్రాఫిక్ జామ్
X

మహాకుంభమేళా దారిలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. త్రివేణి సంగమ క్షేత్రానికి చేరుకునేందుకు 10 నుంచి 12 గంటల టైం పడుతోంది. ఆరు రూట్లలో వాహనాలు ముందుకు కదలడం లేదు. వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ చేరుకునే దారిలో 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభిం చింది. ఇవాళ ఒకే రోజు 46 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు కుంభమేళాలో 44 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ప్రయాగ్ రాజ్ రైల్వేస్టేషన్ క్లోజ్ భారీగా భక్తులు తరలిరావడంతో ప్రయాగ్ రాజ్ సంగం రైల్వేస్టేషన్ మూసి వేశారు. స్టేషన్ నుంచి భక్తులు బయటికి రావడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలి కంగా మూసి వేశామని నార్తర్న్ రైల్వే సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ కుల్దీప్ తివారీ తెలిపారు.

సర్కారు వైఫల్యం : అఖిలేశ్

కుంభమేళా నిర్వహణలో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. ప్రయాగ్ రాజ్ లో కనీసం నిత్యావసర వస్తువులు కూడా దొరకడం లేదని ఆరోపించారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. భారీగా వాహనాలు రావడంతోనే.. కుంభమేళా ప్రదేశానికి వాహనాలు భారీ సంఖ్యలో రావడంతోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ కుల్దీప్ సింగ్ తెలిపారు. భక్తులు వీలైంత దగ్గరిగా రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాటిని క్లియర్ చేసేందుకు సమయం తీసుకుంటుందని వెల్లడించారు.

Tags

Next Story