కరోనా అంటే ఏంటో చక్కగా వివరించిన బుడ్డోడు.. న్యూటన్ ఫోర్త్ లా ప్రకారం..

కరోనా అనేది ఎవ్వరూ సాధారణంగా తీసుకునే విషయం కాదు.. రెండేళ్లలో దీని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా ఎవ్వరూ ఊహించని మహమ్మారిగా వచ్చి చాలామంది ప్రాణాలను తీసుకుంది కరోనా. కానీ రెండేళ్ల నుండి కరోనాతో బ్రతికినా తర్వాత.. దాని మీద జోక్స్ వేయడం కూడా మొదలుపెట్టేశారు ప్రజలు. తాజాగా కరోనా గురించి ఓ స్కూల్ విద్యార్థి వివరించిన పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూటన్ లా ప్రకారం ఒక యాక్షన్‌కు మరో రియాక్షన్ ఉంటుంది. ఆ సూత్రాన్ని వివరిస్తూ.. కరోనా పెరుగుతుంటే పరిశోధనలు తగ్గుతాయి. పరిశోధనలు పెరిగితే కరోనా తగ్గుతుంది అంటూ చక్కగా వివరిస్తూ రాశాడు. ఈ విద్యార్థి రాసిన ఈ స్టడీ పేపర్‌ను ఓ ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేయడంతో ఆ విద్యార్థి మేధస్సు వెలుగులోకి వచ్చింది.
కరోనా వల్ల దాదాపు సంవత్సరంన్నరకు పైగా స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతబడే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పరిస్థితులు మళ్లీ మామూలుగా అనిపిస్తున్నాయి. కానీ ఇంతలోనే కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో తర్వాత ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి.
'कोविड काल' का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP
— Awanish Sharan (@AwanishSharan) January 4, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com