China : అంతరిక్ష యాత్రకు టికెట్లు విక్రయిస్తున్న చైనా కంపెనీ

China : అంతరిక్ష యాత్రకు టికెట్లు విక్రయిస్తున్న చైనా కంపెనీ
X

చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ స్పేస్‌ టూరిజంను ప్రవేశపెట్టింది. 2027లో చేపట్టనున్న అంతరిక్ష పర్యటకానికి సంబంధించి టికెట్లను విక్రయించనుంది. చైనాకు చెందిన స్టార్టప్‌ డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ 2027లో అంతరిక్ష యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈక్రమంలో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌లోని రెండు సీట్ల టికెట్లు విక్రయానికి పెట్టనున్నట్లు తెలిసిందే. అయితే ఈ టికెట్టు ధర 1.5 మిలియన్‌ యువాన్లుగా (భారత కరెన్సీలో అక్షరాల రూ.1.77 కోట్లు) తెలిపింది. ఈ టికెట్లు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. సబ్‌ ఆర్బిటల్‌ ఫ్లైట్‌లో ప్రయాణికులను తీసుకువెళతామని తెలిపింది. అంటే రాకెట్‌ భూ వాతావరణాన్ని దాటి, అంతరిక్షం దరిదాపుల వరకూ వెళ్లి వస్తుంది.

Tags

Next Story