Viral Video : సీటు కోసమే అలా చేసిందా.. లేక యాధృచ్ఛికంగా జరిగిందా..?

Viral Video : సీటు కోసమే అలా చేసిందా.. లేక యాధృచ్ఛికంగా జరిగిందా..?
తాజాగా ఓ మెట్రో రైలులో తన ముందు నిల్చున్న అమ్మాయికి తాను కూర్చున్న సీటుని ఆఫర్ చేశాడు ఓ యువకుడు.

సాధారణంగా బస్సులో, ట్రైన్‌‌‌లో, మెట్రోలో ఎవరైనా వృద్దులు, మహిళలు, మానసిక వికలాంగుల, గర్భిణీ స్త్రీలు నిలబడడం కనిపిస్తే వారికి మగవారు లేచి వారి సీటుని ఆఫర్ ఇవ్వడం చూస్తుంటాం.. తాజాగా ఓ మెట్రో రైలులో తన ముందు నిల్చున్న అమ్మాయికి తాను కూర్చున్న సీటుని ఆఫర్ చేశాడు ఓ యువకుడు... నల్ల దుప్పటి కప్పి ఓ చిన్నపిల్లాడిని ఆమె చేతుల్లో ఎత్తుకున్నట్లు కనిపించడంతో పాపం ఎంత ఇబ్బంది పడుతుందో అని ఆ యువతికి ఈ ఆఫర్‌ ఇచ్చాడు ఆ యువకుడు. దీనిని ఆ యువతి హ్యాపీగా అంగికరించి సీటులో కూర్చుంది. అయితే కొద్దిసేపటికి ఆమె చేతిలో పట్టుకున్నది టెడ్డీ బేర్‌ అని తెలిసి షాక్ అయ్యాడు. ఇది ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. సీటు కోసమే అలా చేసిందా.. లేక యాధృచ్ఛికంగా జరిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story