Marriage Ceremony : ఒకేసారి ఇద్దర్ని మనువాడిన యువకుడు

ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా యువకుడు, ఇద్దరు యువతుల పెద్దల అంగీకారంతోనే. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబా ద్ జిల్లా లింగాపూర్ మండలంలోని గుంనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గుంనూరు గ్రామానికి చెందిన సెడ్మకి సూర్యదేవ్ కు సిర్పూర్ మండలం పుల్లార గ్రామానికి చెందిన ఆత్రం జల్కర్ దేవితో, శెట్టి హడ్పనూర్ రాజుల్ గూడ గ్రామానికి చెందిన కనకలాలేవితో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడి వారితో ప్రేమాయణం సాగిస్తూ వస్తున్నాడు. అయితే లాలేవీతో బంధువుల సమక్షంలో పెళ్లి నిశ్చమయైంది. విషయం తెలుసుకున్న జల్కర్ దేవి తననే పెళ్లి చేసుకోవాలని పట్టుపడింది. ఇద్దరు అమ్మాయిలతో సూర్యదేవ్ ప్రేమ సంబంధం బందువుల ద్వారా కులపెద్దల దాకా వెళ్లింది. అమ్మాయిల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ని ర్వహించిన కులపెద్దలు... ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని యువకుడిని సూచించారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో నిన్న గొప్పగా పెళ్లి వేడుక నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com