Aghori : కాకినాడ పాదగయలో అఘోరీ

Aghori : కాకినాడ పాదగయలో అఘోరీ
X

తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌చల్‌ సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో ప్రవేశించిన అఘోరీ పాదగయలో ప్రత్యక్షమైంది. విశాఖ అన్నవరం నుంచి పాదగయ చేరుకున్న అఘోరీ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, పదవ శక్తిపీఠం పురూహుతికా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అఘోరి వేషధారణ చూసి ఆలయంలోని భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. దర్శనం అనంతరం ఆమె ఎలాంటి వ్యఖ్యలు చేయలేదు. విజయవాడ వెళ్తున్నట్లు మాత్రం తెలిపింది అఘోరీ. అక్కడే పవన్ ను కలుస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరోవైపు.. శంషాబాద్ హనుమాన్ టెంపుల్ ఇష్యూపైనా సీరియస్ అయింది అఘోరీ. ధర్మ రక్షణలో మరింత అనర్థాలు జరగబోతున్నాయని.. హిందువులు ఏకం కావాలని పిలుపునిచ్చింది.

Tags

Next Story