Lady Aghori : అఘోరీకి భారీగా ఆస్తులు.. చిట్టా ఇదే!

Lady Aghori : అఘోరీకి భారీగా ఆస్తులు.. చిట్టా ఇదే!
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ మరో సెన్సేషన్ వార్తలతో హెడ్ లైన్స్ లో నిలిచారు. ఆమె గురించిన షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. లేడీ అఘోరీ కోట్లాది ఆస్తులు ఉన్నాయంటున్నారు. ఈ విషయాలను ఇటీవల అఘోరీతో సావాసం చేసిన వర్షిణి తల్లిదండ్రులు బయటపెట్టారు. ప్రస్తుతం వర్షిణి తిరిగి మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే వర్షిణి తల్లిదండ్రులు అఘోరీ ఆస్తులకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకు అఘోరీ పూజలు చేస్తుందని అందుకోసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేస్తుందన్నారు. హీరో ప్రభాస్ ఇంటి పక్కన 8 కోట్ల విలువైన విల్లా కూడా ఉన్నట్లు తెలిపారు. ఆమెపై విచారణ జరిపించి నిజ స్వరూపం బయటపెట్టాలని కోరుతున్నారు.

Tags

Next Story