Aghori : నిర్బంధంలో అఘోరీ.. సికింద్రాబాద్ కు వెళ్తానంటూ పట్టు

Aghori : నిర్బంధంలో అఘోరీ.. సికింద్రాబాద్ కు వెళ్తానంటూ పట్టు
X

హాట్ టాపిక్ గా మారిన నాగసాధు అఘోరీ ఇంకా పోలీసుల పర్యవేక్షణలో గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అఘోరీని బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని సొంతూరికి పోలీసులు తరలించారు. అక్కడే తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్తానంటూ అఘోరీ పట్టుబట్టడంతో ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు పహారా కాశారు. మరోవైపు అఘోరీ తమతో ఉండటంపై కుటుంబ సభ్యులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నాగసాధువుల్లో కలిశారు కాబట్టి..ఆయన అలాంటి చోటే ప్రశాంతత ఉంటుందని చెబుతున్నారు. గ్రామస్తులు కూడా అఘోరీని తమ గ్రామం నుంచి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. ఏం చేయాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు.

Tags

Next Story