Saif Ali Khan Case : సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది తన కొడుకు కాదని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తండ్రి రుహుల్ అమిన్ తెలిపారు. పోలీసులు తన కుమారుడిపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. తన కుమారుడు ఎప్పుడూ పొట్టి జుట్టుతోనే ఉంటాడని తెలిపారు. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్‌లో చాలా హత్యలు జరిగాయని, వాటిని చూసి భయపడి అతడు భారత్ వెళ్లాడని వివరించారు.
తనపై కత్తిదాడి కేసులో యాక్టర్ సైఫ్ అలీఖాన్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘కరీనా, నేనూ 11వ ఫ్లోర్‌లో ఉన్నాం. సడన్‌గా అరుపులు వినిపించడంతో జే రూమ్‌కు వెళ్లాం. అతను ఏడుస్తున్నాడు. అక్కడెవరో ఉన్నట్టు గమనించి పట్టుకొనేందుకు ప్రయత్నించా. ఆగంతకుడి కత్తిపోట్ల వల్ల నా పట్టు తప్పింది. వెంటనే జేను వేరే గదిలోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు రూ.కోటి డిమాండ్ గురించి చెప్పారు’ అని ఆయన వివరించారు.
సైఫ్ అలీఖాన్ స్టేట్‌మెంటుకు దాడి జరిగిన రోజు సంఘటనలకు పొంతన కుదరడం లేదని కొందరు అంటున్నారు. 11వ ఫ్లోర్‌లో ఉన్న కరీనా, తాను జే రూమ్‌కు వెళ్లామని సైఫ్ చెప్పారు. ఆగంతకుడిని చూశాక జేను వేరే గదిలోకి తీసుకెళ్లామన్నారు. కరీనా తనతోనే ఉన్నప్పుడు దాడి జరగ్గానే ఆమే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదన్నది ప్రశ్న? గదిలో బంధించిన షరీఫుల్ ఎలా తప్పించుకున్నాడు? ఈ ఘటనలో పని మనిషి పాత్రేంటో తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com