AP Woman : మిస్సెస్ ఇండియాగా ఏపీ మహిళ.. తెలంగాణ నుంచి పోటీలో నిలిచి కిరీటం.

X
By - Manikanta |31 July 2025 11:45 AM IST
అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సంబేపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయ లక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది. 50 ఏళ్ల విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్‌పీసీఎల్ డీలర్. 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు నెలలపాటు జరిగింది. తెలంగాణ నుంచి పోటీలో నిలిచిన విజయలక్ష్మి ఆన్‌లైన్‌లో జరిగిన రౌండ్స్‌లో గ్రాండ్ ఫినాలేకి ఎంపికైంది. 18 మంది పాల్గొన్న గ్రాండ్ ఫినాలేలో నాలుగు రౌండ్లలో ప్రతిభను కనబరిచి మిస్సెస్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకుంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com