Annamayya District : అన్నమయ్య జిల్లాలో శబరిమల భక్తులపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ

Annamayya District :  అన్నమయ్య జిల్లాలో శబరిమల భక్తులపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
X

అన్నమయ్య జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఘటన పెను దుమారం రేపుతోంది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. శబరిమల యాత్రకు వెళ్లే వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో స్వాములు ఆందోళన విరమించారు. ఇరు వర్గాల వారికి పోలీసులు సర్దిచెప్పి .. ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారం మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఎస్పీ సమక్షంలో పీస్ కమిటీ వేయించి ఇరు వర్గాలతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Tags

Next Story