Anchor Shyamala : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పే: యాంకర్ శ్యామల

బెట్టింగ్ యాప్స్ ప్రమోష న్ కేసుల్లో పంజాగుట్ట పీఎస్ లో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు ఆమెను పోలీసులు ఎంక్వైరీ చేశారు. విచారణ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడారు. 'బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు దీనిపై స్పందించలేను. పోలీసు విచా రణకు సహకరిస్త. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు. నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది . ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోష న్స్ చేయం' అని తెలిపారు. ఇక, యాంకర్ శ్యామలతో పాటు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ ల ఆచూకీ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్న ట్టు తెలిపారు. దీంతో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీతో పాటు పలువురు నటీమణులు సైతం ఉన్నారు. కాగా, ఇప్పటికే టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారణ చేశారు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు విచారించారు. తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించి వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com