Delhi High Court judge : హైకోర్టు జడ్జి ఇంట్లో బయటపడిన నోట్ల కట్టలు

Delhi High Court judge : హైకోర్టు జడ్జి ఇంట్లో బయటపడిన నోట్ల కట్టలు
X

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం తర్వాత భారీ మొత్తంలో నగదు లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఆ సమయంలో ఢిల్లీలో లేరు. అగ్నిప్రమాదం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పివేసిన తర్వాత, అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీనిని అధికారులు ఐటీ లెక్కల్లో చూపించని డబ్బుగా గుర్తించారు.

Tags

Next Story