Dead Frog: వామ్మో హోటల్ ఫుడ్డు.. ఇడ్లీలో చచ్చిన కప్ప..
Dead Frog: ఇంట్లో రుచిగా, శుచిగా వండితే ఎవరికీ నచ్చదే.. వీకెండ్స్‌లో అన్నా హోటల్‌కి వెళ్లకపోతే ఎలా.. అందరూ కలిసి తింటే బాగానే ఉంటుంది.. అందులో ఏమేం ఉంటాయో తెలిస్తేనే గుండె గుభేల్‌మంటుంది. ఇలాంటి సంఘటనలు చూస్తే హోటల్ ఫుడ్ అంటేనే భయం వేస్తుంది..
చెన్నై కుంభకోణంలోని ఓ హోటల్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఓ వ్యక్తి దగ్గరలోని ఓ హోటల్‌లో ఇడ్లీ కొనుగోలు చేసి పేషెంటుకు తీసుకువెళ్లాడు. పేషెంట్ ఆ ఇడ్లీలను తింటుండగా చచ్చిన కప్ప ఒకటి కనిపించింది. దాంతో తిన్నదాన్ని బలవంతంగా బయటకు పంపించాడు సదరు వ్యక్తి. కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో అనేక హోటళ్లు ఉంటాయి. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటే హోటల్స్‌లో పరిశుభ్రత కొరవడిందనేదానికి ఇది నిదర్శనం.
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువుకు కుంభకోణం మడకుడి నివాసి మురుగేశన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్ నుంచి ఇడ్లీ పార్శిల్ కొనుగోలు చేశాడు. అనంతరం పేషెంట్ పార్శిల్‌ను విప్పి ఇడ్లీ తినేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఇడ్లీ మధ్యలో చచ్చిన కప్ప ఒకటి కనిపించింది. ఇది చూసిన పేషెంట్ వాంతి వచ్చినంత పనైంది. తీవ్ర మనస్తాపానికి గురైన రోగి బంధువులు వెంటనే ఇడ్లీ పార్శిల్ తీసుకుని హోటల్‌కు వెళ్లి యజమానికి ఫిర్యాదు చేశారు.
హోటల్ యజమాని వారికి గొడవ చేయొద్దని సర్ధిచెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. ఈ విషయం బయటకు చెప్పవద్దని వారికి డబ్బులు ఇచ్చాడు. అటుపై హోటల్ యజమాని అప్పటికే గ్రైండ్ చేసి ఉంచిన ఇడ్లీ పిండిని కొనుగోలుదారుడి ముందే పారపోశాడు.
గొడవ పెద్దదయ్యేలా ఉందని భావించి హోటల్‌కు తాళం వేసి యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని అంతా ఓ కస్టమర్ వీడియో తీసి ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇడ్లీలో కప్ప ఉన్న దృశ్యాలు సామాజిక వెబ్‌సైట్లలో వేగంగా వ్యాపించాయి. ప్రజలు, రోగులు తినే ఆహారాన్ని అజాగ్రత్తగా వండుతున్న హోటల్ యజమానికి జరిమానా విధించాలని, హోటల్‌కు సీల్ వేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. తమిళనాడులోని కొన్ని హోటళ్లలో నాసిరకం ఆహారాన్ని విక్రయిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఆ ఆహారం తిన్న కొందరు అస్వస్థతకు గురయ్యారు. అందువల్ల హోటళ్లలో ఆహార నాణ్యతపై ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com