Goa Tourism : కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
గోవాకు విదేవీ టూరిస్టులు తగ్గడానికి మరో కారణం ఆటో మాఫియా.. గోవా ట్యాక్సీ కంపెనీలు చార్జీలు పెంచడం, మీటర్లు లేకపోవడం, అందించే కొన్ని సంస్ధలు పర్యాటకులను అడ్డగోలు ఛార్జీలతో దోచుకోవడం, విదేశీయులతో ఘర్షణలు ఇలా అనేక అంశాలు గోవా టూరిజంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ ఛార్జీల పారదర్శకత ప్రధాన సమస్యగా మారింది. ఒకప్పుడు ప్రశాంతంగా ,అందంగా ఉన్న గోవా బీచ్‌లు ఇప్పుడు సందర్శకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణం వల్ల కూడా కొంత విదేశీ పర్యాటకులు తగ్గారని తెలుస్తోంది. 2019లో 85లక్షలున్న విదేశీ టూరిజం 2023లో కేవలం 15లక్షలకు తగ్గింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com