Konaseema: కోనసీమ జిల్లాలో అరుదైన కప్పలు.. పసుపురంగులో..

Konaseema: కోనసీమ జిల్లాలో అరుదైన కప్పలు.. పసుపురంగులో..
Konaseema: కోనసీమ జిల్లాలో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి.

Konaseema: కోనసీమ జిల్లాలో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి. అమలాపురం మండలం బండారు లంక గ్రామంలోని మట్టివర్తివారిపాలెంలో ఇవి కనిపించాయి. పసుపు రంగులో కప్పలు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. అయితే.. ఇవి మాములు కప్పలేనన్నారు పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు విజయరెడ్డి. వీటిని బుల్‌ ఫ్రాగ్స్‌ అంటారన్నారు. ఖాకీ, ఆలీవ్‌ కలర్లో ఉండే ఈ కప్పలు ఒక్కసారిగా రంగు మారతాయని, పసుపురంగంలో మారేవి మగకప్పలేనన్నారు. బ్రీడింగ్‌ సీజన్‌లో ఆడకప్పలను ఆకర్షించేందుకు ఈ కప్పలు రంగులు మారుస్తాయన్నాయని వివరించారు.

Tags

Next Story