Chahal : ధనశ్రీతో విడాకులు.. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా - చాహల్

భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గత కొన్నేళ్లుగా తన వృత్తి జీవితం కంటే వ్యక్తిగత జీవితంతోనే వార్తల్లో నిలిచాడు. ధనశ్రీ వర్మ నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి చాహల్ మౌనంగా ఉంటున్నాడు. ఆ సమయంలో చాహల్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. ధనశ్రీ నుండి విడాకులు తీసుకున్న తర్వాత నెటిజన్లు అతన్ని "మోసగాడు" అని విమర్శించారు. ఇటీవలి ఇంటర్వ్యూలో.. చాహల్ కీలక విషయాలు వెల్లడించారు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించినట్లు తెలిపాడు.
ధనశ్రీ వర్మ నుండి విడాకులు తీసుకున్న తర్వాత తనను మోసగాడు అని తప్పుగా ముద్రించారని చాహల్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ, ఎవరినీ మోసం చేయలేదని చెప్పాడు. ‘‘నేను చాలా నమ్మకమైన వ్యక్తిని. నాలాంటి నమ్మకమైన వ్యక్తి నీకు ఎక్కడా దొరకడు. నాతో ఉన్న వ్యక్తుల గురించి చాలా శ్రద్ధ వహిస్తాను. నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. కాబట్టి స్త్రీలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. నన్ను ఎక్కువగా బాధించే విషయం ఏమిటంటే.. నా కథ పూర్తిగా తెలియకుండానే జనాలు నన్ను విమర్శించారు’’ అని చాహల్ రాసుకొచ్చారు.
తాము నాణ్యమైన సమయాన్ని కలిసి గడపలేకపోవడం వల్లే అంతరం పెరిగిందని చాహల్ చెప్పుకచ్చాడు. రెండు వైపుల నుండి రాజీ అవసరం అయినప్పటికీ, కొన్నిసార్లు అభిప్రాయ భేదాల కారణంగా ప్రతిదీ నాశనమవుతుందని తెలిపాడు. ‘‘నేను, ధనశ్రీ మా కెరీర్‌లతో బిజీగా ఉన్నాము. దీని కారణంగా, గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఇది క్రమంగా సంబంధాన్ని ప్రభావితం చేసింది’’ అని చాహల్ తెలిపారు. విడాకుల తర్వాత కొన్నాళ్లు డిప్రెషన్‌లో ఉన్నట్లు చాహల్ తెలిపాడు. ఆ సమయంలో ఆత్మహత్య గురించి ఆలోచించినట్లు సంచలన విషయం బయటపెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com